11 April, 2026 | 11:27 PM

బూతు స్థాయి నుండి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దాం

11-04-2026 09:56 PM

జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చిన్నం సత్యం

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ప్రతి మండలం బూతు స్థాయి నుండి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు, ఖానాపూర్ మున్సిపాలిటీ 11వ వార్డు కౌన్సిలర్ చిన్నం సత్యనారాయణ అన్నారు. ఆయనను నిర్మల్ జిల్లా మామడ మండలం బూతు అధ్యక్షునిగా నియమించిన అనంతరం మామడ గ్రామంలో ఒక కార్యక్రమంలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.

ఈ సందర్భంగా మండలంలోని ప్రతి గ్రామంలో ఒక యువ నాయకున్ని తయారు చేయాలని, కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వారికి అర్థమయ్యే విధంగా తెలియజేయాలని పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కష్టపడి పార్టీ రానున్న ఎన్నికల్లో విజయం సాధించే లాగా కృషి చేయాలని ఆయన అన్నారు.