1 June, 2026 | 2:46 AM

జొన్న రైతును దోచుకుంటున్న లారీల డ్రైవర్లు,యజమానులు

01-06-2026 01:17 AM

ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి రైతుల మొర

బోథ్ . మే 3౧ (విజయ క్రాంతి) రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని జొన్నల మార్కెట్లో లారీల యజమానులు డ్రైవర్లు ఆటలాడుతున్నారు. ప్రభుత్వ పరంగా లారీలకు అద్దె చెల్లిస్తున్న అదనంగా డబ్బులు బస్తాకు 20 నుండి 30 రూపాయల వరకు వసూళ్లకు పాల్పడుతున్నారు.ఈ తతంగమంతా అధికార యంత్రాంగానికి తెలిసిన చేతులెత్తేసిందని రైతులు విమర్శిస్తున్నారు. ఇదేమిటని నిలదీస్తే మీ ఇష్టం ఉంటే మా లారీల్లో నింపండి లేకుంటే లేదు అని రైతులను దుబాయిస్తున్నారు.

సోనాల మండల కేంద్రంలో ఆదివారం ఏకంగా 45 రూపాయలు బస్తాకు చెల్లించాలని డిమాండ్ చేసినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. బోత్ మార్కెట్లో సైతం ఇదే విధమైన పరిస్థితి నెలకు ఉందని రైతులు వాపోతున్నారు. అయితే లారీల యజమానులు చేస్తున్న దోపిడీని అరికట్టాలని కోరుతూ ఆదివారం నేరడిగొండ మండల కేంద్రం లో జొన్న రైతులు స్థానిక శాసనసభ్యులు అనిల్ ఇంటికి తరలి వెళ్లారు. లారీల యజమానులు కొంతమంది డ్రైవర్లు బస్తాకు 20 నుండి 30 రూపాయలు డిమాండ్ చేస్తున్నారని ఇప్పటికే 15 రోజులుగా పంటకు కాపలాగా ఉంటే వ్యవసాయ పనులు ఎలా చేసుకోవాలని ఎమ్మెల్యేకు వివరించారు. స్పందించిన ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ తో ఈ విషయమై మాట్లాడారు. 

త్వరలోనే మరిన్ని లారీలు మార్కెట్ కు వచ్చే విధంగా చూస్తామని అదనంగా డబ్బులు అడిగితే ఇవ్వవద్దని అధికారులు సూచించినట్లు ఎమ్మెల్యే రైతుల వివరించారు. ఏదేమైనా అష్ట కష్టాలు పడి పండించిన పంటను అమ్ముకోవడం తలకు మించిన భారంగా మారిందని రైతులు వాపోతున్నారు.