29 July, 2026 | 2:12 AM

యూబీఐ ఎదులాపురం బ్రాంచ్ ప్రారంభం

29-07-2026 01:10 AM

ఖమ్మం (ఎదులాపురం), జూలై 28 (విజయక్రాంతి): యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నివేళలా ప్రజలకు, ఖాతాదారులకు సేవలందించడంలో ముందుంటుందని చీఫ్ మేనేజర్, జోనల్ హెడ్ హైదరాబాద్ ఎం. రవీంద్రబాబు అన్నారు. మంగళవారం ఎదులాపురంలో యూబీఐ నూతన శాఖను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా రవీంద్రబాబు మాట్లాడుతూ.. త్వరలోనే నూతన శాఖలో అన్ని రకాల సేవలు అందిజేస్తామని, ప్రజలు, ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డిప్యూటీ జనరల్ మేనేజర్ వెంకటరావు మాట్లాడుతూ.. ఖాతాదారులు బ్యాంకింగ్ సేవలకు యూనియన్ బ్యాంకును సంప్రదించవచ్చని కోరారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం ఎన్. సుధాకర్‌రావు, బ్రాంచి మేనేజర్ ఎం. గోపీ, బ్రాంచ్ సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు.