కలతేలా..
29-07-2026 01:13 AM
విశాల్ హీరోగా, దర్శకుడిగా రూపొందిస్తున్న చిత్రం ‘మకుటం’. సూపర్ గుడ్ ఫిలమ్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఆర్‌బీ చౌదరి నిర్మాత. ఈ చిత్రంలో అంజలి, దుషార విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ తాజాగా ‘కలతేలా’ అంటూ సాగే సాంగ్‌ను చిత్రయూనిట్ రిలీజ్ చేశారు. ఈ పాటను రాజశ్రీ సుధాకర్ రచించగా, కృష్ణ తేజస్వీ ఆలపించారు. జీవీ ప్రకాశ్ అందించిన బాణీ క్యాచీగా ఉంది. ఈ సినిమాకు రిచర్డ్ ఎం నాథ న్, అభినందన్ రామానుజం కెమెరామెన్లుగా, చీదీ శ్రీకాంత్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.






