చిట్టీ చిట్టీ చీమ..
29-07-2026 01:11 AM
హీరో దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ‘ఆకాశంలో ఒక తార’ మూవీ యూనిట్ మంగళవారం ఫస్ట్ సింగిల్ ‘చిట్టి చిట్టి చీమ’ను విడుదల చేసింది. ‘చిట్టీ చిట్టీ చీమ.. చిట్టి చేతుల హయ్యో రామ.. వంద టన్నుల చక్కెర మోస్తోందమ్మా.. కొండపల్లి బొమ్మ కొండకోన దాటిందమ్మా.. తన కలల వైపు నడిచిందమ్మా..’ అంటూ సాగుతోందీ గీతం. జీవీ ప్రకాశ్‌కుమార్ స్వరపరిచిన ఈ పాట ను శ్రీమణి రాయగా, రమ్య బెహరా ఆలపించారు. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్‌తోపాటు సాత్వి క వీరవల్లి, శ్రుతి హాసన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పావన్ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని లైట్‌బాక్స్ మీడియా బ్యానర్‌పై సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మిస్తున్నారు.






