1 June, 2026 | 2:06 AM

అంతర్జాతీయ ప్రమాణాలతో కోహెడ మార్కెట్

01-06-2026 01:17 AM
  1. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
  2. మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే తదితరులు

హైదరాబాద్, మే 31(విజయక్రాంతి): కోహెడలో నిర్మిస్తున్న అంతర్జాతీయ సమీకృత మార్కెట్ దేశానికే తలమానికంగా నిలుస్తుందని, అంతర్జాతీయ ప్రమాణాలో కోహెడ మార్కెట్‌ను నిర్మిస్తున్నామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా మెరుగైన ప్రమా ణాలతో కూడిన మార్కెట్‌గా ఉండబోతుందన్నారు.

అదివారం వ్యవసాయ సహకార శాఖ ముఖ్య కార్యదర్శి కె సురేంద్ర మోహన్ (ఐఏఎస్) మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మిబాయి, గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్‌కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి, ఇతర ఉన్నత అధికారులు,పాలకవర్గం సభ్యులతో కలసి ఎమ్మె ల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కోహెడ మార్కెట్ శంకుస్థాపన నిర్మాణ పనులను పరిశీలించారు. అంతకుముందు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి కె సురేంద్రమోహన్ కోహె డ గుట్ట ప్రసన్న ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేకపూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డితో పాటు అధికారులు సభ ప్రాంగణాన్ని తిరిగి పరిశీలించారు. కొన్ని మార్పు చేర్పులను సూచనలను సంబంధిత అధికారులకు తెలియ జేశారు. అనంతరం జరిగిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ కోహెడలో నిర్మించే మార్కెట్ దేశానికే దిక్సూచిగా మారుతుందని అన్నారు. రైతులకు, వ్యాపారులకు, వినియోగదారులకు అందుబాటులో ఉండేలా అన్ని సౌకర్యాలతో కూడిన ఏర్పాట్లు ఈ మార్కెట్ లో ఉంటాయని తెలిపారు. 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే శంకుస్థాపన కార్యక్రమంలో వేలాది మంది రైతులు, మహిళలు పాల్గొంటారని చెప్పారు. వ్యవసాయ, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి కె సురేంద్ర మోహన్ మాట్లాడుతూ కోహెడలో ఏర్పాటు చేయబోతున్న మార్కె ట్ ఇంకో 50 సంవత్సరాల అవసరాలకు దోహద పడుతుందని అన్నారు. దేశం లో ఎక్కడా లేని విధంగా ఈ మార్కెట్‌లో కొత్త టెక్నాలజీతో పాటు మంచి ప్రమాణాలతో కూడిన మార్కెట్ ను నిర్మిస్తున్నామ న్నారు.

ఈ కార్యక్రమంలో హాకా డైరెక్టర్ చంద్ర శేఖర్ రెడ్డి (ఐఏఎస్), గిడ్డంగుల సంస్థ ఎండీ కొర్ర లక్ష్మి (ఐఏఎస్), ఆగ్రోస్ ఎండీ రాము లు, అడిషనల్ డైరెక్టర్ లక్ష్మణుడు, రవికుమార్‌తో పాటు గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ సీహెచ్ భాస్క ర చారి,మార్కెట్ ఉన్నత శ్రేణికార్యదర్శి ఎల్.శ్రీనివాస్, సభ్యులు పన్యాల జైపాల్ రెడ్డి, బండి మధుసూదన్ రావు, అంజయ్య, మేకం లక్ష్మి, రఘుపతిరెడ్డి, నవరాజ్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.