1 June, 2026 | 2:06 AM

అహల్య బాయి హోల్కర్ జీవితం స్ఫూర్తిదాయకం

01-06-2026 01:15 AM

 సిర్సన్న లో విగ్రహ ప్రతిష్ఠాపన...

బేల: మే 31 (విజయక్రాంతి) మండలంలోని సిర్సన్న గ్రామంలో అహల్య బాయి హోల్కర్ జయంతి సందర్బంగా నూతన వి గ్రహ ప్రతిష్టపన ఘనంగా నిర్వహించారు. నూతన విగ్రహనికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఘన నివాళులు అర్పించారు. అనం తరం మహా అన్నదానం నిర్వహించారు.

ఈ సందర్బంగా సిర్సన్న గ్రామ యూత్ ప్రసిడెంట్ ఊరడే అమూల్ మాట్లాడుతూ అహ ల్య బాయి హోల్కర్ జయంతిని పురస్కరించుకొని గ్రామానికి చెందిన దన్కర్ కుల స్థులు కలిసి కట్టుగా లక్ష యాభై వేల రూపాయలతో అహల్య బాయి హోల్కర్ విగ్రహా న్ని ప్రతిష్టపించడం జరిగిందన్నారు. సనాతన ధర్మ వెలుగులను దేశమంతటా వ్యాపింపజేసిన రాజమాత దేవి అహల్య బాయి హోల్కర్ అని కొనియాడారు. ఆమె జీవితం మహిళలకు ఆదర్శప్రాయమన్నారు. మరాఠ సామ్రాజ్యానికి చెందిన మాల్వా ప్రాంతాన్ని దాదాపుగా 30సంవత్సరాల పాటు అత్యంత సమర్థవంతంగా పరిపాలించిన గొప్ప యో ధురాలు అన్నారు.