అనకాపల్లి లబ్బరు బొమ్మ
09-05-2026 12:24 AM
వ్యశ్రీ మూవీ మేక ర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మిస్తున్న రా అండ్ రస్టిక్ చి త్రం ‘అనకాపల్లి’. ఈ సినిమాకు ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట జంటగా నటించారు. ఈ చి త్రానికి కథ, స్క్రీన్‌ప్లేను అందించడమే కాకుండా త్రినాథరావు నక్కి ఓ ము ఖ్యపాత్రను కూడా పోషించారు.
తాజాగా మాస్ సాంగ్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ‘లబ్బరు బొమ్మ’ అంటూ సాగుతోందీ ఐటం సాంగ్. రాంబాబు గోశాల రాసిన ఈ పాటను దేవ్ జండ్ స్వరపర్చగా, శ్రీకృష్ణ, సాహితీ చాగంటి పాడారు. ఈ చిత్రానికి డీవోపీ: మాయా వీ; సంగీతం: దేవ్ జండ్; ఎడిటర్: శ్రీకృష్ణ అట్టలూరి; ప్రొడక్షన్ డిజైనర్: రఘు కులకర్ణి.






