9 May, 2026 | 2:54 AM

పెద్ది ఆట షురూ

09-05-2026 12:27 AM

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నుంచి వస్తున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమా థియేటర్లలోకి రాకముందే సంచలనాలు సృష్టిస్తోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ పాన్ ఇండియా చిత్రానికి నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ దూసుకె ళ్తున్నాయి. బుకింగ్స్ ప్రారంభమైన నాలుగు గంటల వ్యవధిలోనే ఈ సినిమా 100కే డాలర్ల మార్క్‌ను దాటేసి ఆల్‌టైమ్ రికార్డ్ నమోదు చేసింది. ట్రైలర్ కూడా విడుదల కాకముందే ఈ స్థాయి ఓపెనింగ్ రావడం సంచలనంగా మారింది.

జూన్ 4న విడుదల కానున్న ఈ సినిమా ప్రీమియర్ షోలు జూన్ 3 నుంచే ప్రారంభం కానున్నాయి. శ్రీలంక, ఆస్ట్రేలియా, సింగపూర్ సహా పలు దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఫైనల్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ విడుదలైతే ఈ హైప్ మరింత రెట్టింపు అవుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి.

ఇందులో జాన్వీకపూర్ కథానాయిక కాగా, శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఆర్ రత్నవేలు సినిమాటోగ్రాఫర్ కాగా, ఎడిటర్ నవీన్ నూలి ఎడిటింగ్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.