9 July, 2026 | 2:56 AM

కన్నతల్లిని హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదు

09-07-2026 01:40 AM

పోలీసు అధికారులను, సిబ్బందిని అభినందించిన ఎస్పీ

మెదక్, జులై 8 (విజయక్రాంతి) : కన్నతల్లిని హత్య చేసిన కేసులో నిందితుడికి జిల్లా న్యాయస్థానం జీవిత ఖైదుతో పాటు రూ.5,000 జరిమానా విధించినట్లు మెదక్ జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాసరావు తెలిపా రు. టేక్మాల్ మండలం ఎల్పుగొండ గ్రామానికి చెందిన మోహన్ గారి సుదర్శన్ మద్యా నికి బానిసై తరచూ తన భార్యను వేధించేవాడు. దీంతో ఆమె తన పుట్టింటికి వెళ్లిపో యింది.

అనంతరం సుదర్శన్ తన తల్లి సత్య మ్మ వద్దకు వెళ్లి డబ్బులు కావాలని మద్యం మత్తులో తరచూ గొడవపడుతూ, దుర్భాషలాడుతూ, దాడులకు పాల్పడేవాడు. అలాగే తన భార్యను తిరిగి తీసుకురావాలని తల్లితో తరచూ వివాదానికి దిగేవాడు. ఈ క్రమంలో 08-11-2025 అర్ధరాత్రి మద్యం మత్తులో తల్లితో మరోసారి గొడవపడి, కర్రతో ఆమె తలపై బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలపాలైన సత్యమ్మ అక్కడికక్కడే మృతి చెందింది.

మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు టేక్మాల్ పోలీస్ స్టేషన్లో ఏఎస్‌ఐ కృష్ణ కేసు నమోదు చేశారు. అనంతరం ద ర్యాప్తు అధికారి (ఐఓ) అల్లాదుర్గ్ సీఐ రేణుక శాస్త్రీయ ఆధారాలు, సాక్ష్యాధారాలు సేకరిం చి దర్యాప్తు పూర్తి చేసి నిందితుడిపై చార్జిషీట్ దాఖలు చేశారు. కేసులో సమర్పించిన సా క్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన మెదక్ జిల్లా ప్రధాన న్యాయ మూర్తి నీలిమ నిందితుడు మోహన్ గారి సు దర్శన్కు జీవిత ఖైదుతో పాటు రూ.5,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.

ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటేష్ సమర్థవంతమైన వాదనలు వినిపించగా, కోర్టు లైజన్ ఆఫీసర్ ఎస్‌ఐ విఠల్, కానిస్టేబుల్ రవీందర్ గౌడ్, సీడీఓ కృష్ణ సమన్వయంతో పనిచేశారు. ఈ కేసులో తక్కువ సమయంలో దర్యాప్తు పూర్తి చేసి, నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన దర్యాప్తు అధికారి, పబ్లిక్ ప్రాసిక్యూటర్, కోర్టు లైజన్ అధికారులు, పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.