25 July, 2026 | 3:12 AM

రూ.3 లక్షల ఎల్‌ఓసీ అందజేత

25-07-2026 02:30 AM

అలంపూర్, జూలై 24: అలంపూర్ నియోజకవర్గంలోని వడ్డేపల్లి మండలం శాంతినగర్కు చెందిన భీముడు వైద్య చికిత్స కోసం మంజూరైన రూ.3 లక్షల ఎల్‌ఓసీ ప్రతిని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ మేరకు శుక్రవారం కర్నూలులోని ఎమ్మెల్సీ చల్లా కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులతో వైద్యం సహాయ నిమిత్తం అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో   జయన్న  కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.