25 July, 2026 | 3:08 AM

‘రిన్స్’ ఆధ్వర్యంలో న్యూరాలజీ సదస్సు

25-07-2026 02:29 AM

హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): బంజారాహిల్స్‌లోని తాజ్ డెక్కన్ హోటల్ లో శుక్రవారం రెనోవా ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూరోలాజికల్ సైన్సెస్ (రిన్స్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ న్యూరాలజీ సదస్సు హెచ్‌వైఎంఎన్‌ఎన్‌ఎస్సీ ఆన్ 2026 ఘనంగా ప్రారంభమైంది. జూలై 24 నుంచి 26 వరకు జరిగే ఈ సదస్సులో భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా 500 మందికి పైగా న్యూరాలజిస్టులు, పరిశోధకులు, సబ్‌స్పెషలిస్టులు పాల్గొంటున్నారు.

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ జె.ఎమ్. లింగ్డో ముఖ్య అతిథిగా హాజరై సదస్సును ప్రారంభించగా, రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వ్య వస్థాపకులు అండ్ సీఈఓ శ్రీధర్ పెద్దిరెడ్డి గౌరవ అతిథిగా పాల్గొన్నారు. న్యూ రోమస్క్యులర్, న్యూరోఇమ్యునాలజీ వ్యాధుల నిర్ధారణ, ఆ ధునిక చికిత్సలు, పరిశోధనలపై నిపుణులు చర్చించనున్నారు. ఈ సదస్సు వైద్యులకు కొ త్త పరిశోధనలు, ఆధునిక చికిత్సా విధానాలపై అవగాహన కల్పించడం, రోగులకు మ రింత మెరుగైన వైద్య సేవలు అందించేందు కు దోహదపడుతుందని ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ వై. మురళీధర్ రెడ్డి తెలిపారు.