25 July, 2026 | 3:11 AM

ఆరుతడి పంటలను ప్రోత్సహించాలి

25-07-2026 02:32 AM

కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

జోగులాంబ గద్వాల, జూలై 24 (విజయక్రాంతి): ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తున్న నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలు సాగు చేసేలా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆగస్టు 15లోగా నాణ్యమైన ఏకరూప దుస్తులు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించి, తాగునీటి సమస్యల నివారణకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.