5 June, 2026 | 9:12 PM

ధరల పెరుగుదలపై రాజీలేని పోరాటం చేద్దాం

05-06-2026 07:42 PM

పెట్రోల్, డీజిల్ భారాన్ని మోపడం దుర్మార్గం

జూన్ 10 కలెక్టరేట్ ధర్నాను జయం చేయండి

సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా

చుంచుపల్లి,(విజయక్రాంతి): నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలపై రాజీలేని పోరాటం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా పిలుపునిచ్చారు. చుంచుపల్లి మండల విస్తృత కౌన్సిల్ సమావేశం శుక్రవారం బాబు క్యాంపు కార్యాలయం 'రజబ్ అలీ భవన్'లో జరిగింది. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు.

నిత్యావసరాల ధరల భారంతో సామాన్య ప్రజలు బ్రతికే పరిస్థితి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై జూన్ 10న జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగే ధర్నాను భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పార్టీ విస్తరణకు, స్థానిక ప్రజా సమస్యల పరిష్కారానికి నాయకులు, కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సలిగంటి శ్రీనివాస్, వాసిరెడ్డి మురళి, జి వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.