5 June, 2026 | 9:10 PM

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

05-06-2026 07:44 PM

ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

చిట్యాల,(విజయక్రాంతి): ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని బస్టాండ్ వద్ద ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శుక్రవారం  పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పచ్చదనం పెంపొందించేందుకు మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు.