మోడీ సభకు భారీగా తరలిన నాయకులు
11-05-2026 12:45 AM
చేగుంట మే 10: హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగే ప్రధాని నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభకు చేగుంట నుండి భారీగా జనం కదిలారు. మండల అధ్యక్షులు దొంతిరెడ్డి ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో సుమారు 200 మంది కార్యకర్తలు బస్సుల్లో, కార్లలో తరలివెళ్లారు. ఈ కార్యక్రమాన్ని మండల అధ్యక్షులు జెండా ఊపి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు,, వివిధ గ్రామాల సర్పంచ్ లు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






