మోడీ సభకు భారీగా తరలిన నాయకులు
11-05-2026 12:43 AM
వెల్దుర్తి, మే 10 : హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగే ప్రధాని నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభకు వెల్దుర్తి మండలం నుండి భారీగా జనం కదిలారు. మండల అధ్యక్షులు పడిగె దాసు, జిల్లా నాయకుడు చెంది నర్సింలు, నాయకులు శేఖర్ గౌడ్, విశ్వేశ్వర్, శివరాంలు, వెల్దుర్తి సర్పంచ్ ఆదర్శ్ ఆధ్వర్యంలో సుమారు 1000 మంది కార్యకర్తలు బస్సుల్లో, కార్లలో తరలివెళ్లారు. ఈ కార్యక్రమాన్ని మండల అధ్యక్షులు జెండా ఊపి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు, వివిధ గ్రామాల సర్పంచ్ లు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






