ఎంపీగా రెండేళ్లు పూర్తి చేసుకున్న ఈటల రాజేందర్‌కు శుభాకాంక్షలు తెలిపిన లయ కాలంశెట్టి
నాగోల్, జూన్ 11(విజయ క్రాంతి): మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడిగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ను నాగోల్ డివిజన్ బీజేపీ సీనియర్ నాయకురాలు లయ కాలంశెట్టి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లయ కాలంశెట్టి మాట్లాడుతూ, ఎంపీ ఈటల రాజేందర్ పార్లమెంట్లో ప్రజా సమస్యలను సమర్థవంతంగా ప్రస్తావిస్తూ, మల్కాజిగిరి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే సేవా స్ఫూర్తితో ప్రజలకు మరింత చేరువై అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ, ఎంపీగా రెండేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






