3 August, 2026 | 1:41 AM

పేరుకేనా పెద్దాసుపత్రి!

03-08-2026 12:21 AM
  1. ప్రభుత్వాసుపత్రుల్లో అందని వైద్యసేవలు
  2. రాత్రయితే రోగులకు తప్పని తిప్పలు
  3. పేరుకే 24 గంటల ఆసుపత్రులు
  4. కావాల్సిన మందులుండవు&  సరిపడా డాక్టర్లుండరు...
  5. మాతా, శిశు కేంద్రంలో కాన్పులూ అంతంత మాత్రమే..
  6. మూతపడిన ఆక్సిజన్ ప్లాంట్..పనిచేయని వెంటిలేటర్లు
  7. 52మంది డాక్టర్లు అవసరం ఉండగా సుమారుగా 14 మంది డాక్టర్లతో నెట్టుకొస్తున్న వైద్యం
  8. ఇదీ హుజూర్ నగర్ ఏరియా ప్రభుత్వాసుపత్రి దుస్థితి

హుజూర్ నగర్, ఆగస్టు 2 :ఏరియా ఆసుపత్రి పేరు చెబితేనే రోగులు భయపడిచస్తు న్నారు. కనీస వైద్యానికి కూడా నోచుకోక పోవడంతో ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి జేబులు గుల్లజేసుకుంటున్నారు. సూర్యాపేట జిల్లాలో హుజూర్ నగర్ ఏరి యా ప్రభుత్వాసుపత్రిలో రోగులకు అందుతున్న అరకొర వైద్యాన్ని పరిశీలిస్తే ఈ విష యం తేటగా అర్థమవుతుంది.నియోజకవర్గ కేంద్రమైన హుజూర్ నగర్ పట్టణంలో ఉన్న ఏరియా ప్రభుత్వాసుపత్రి లో రోగులు నానా అవస్థలు పడుతున్నారు.

పేరుకే పెద్దాసుపత్రి అయినా అక్కడ రోగులకు మందు లు ఉండవు..కనీసం ఎక్స్రే తీసేవారు ఉండరు. మాతా, శిశు ఆరోగ్య కేం ద్రంలో పరిస్థితి అంతంతమాత్రంగా తయారైంది. స రిపడా వైద్యులు లేకపోవడంతో గ ర్భిణులు బాగా ఇబ్బంది పడుతున్నారు. కా న్పుల కోసం వచ్చేవారికి సూర్యాపేట ప్రభుత్వాసుపత్రికి లేదా ప్రైవేటుకు వెళ్లండంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు.100 పడకలుగా రూ పాంతరం చెందినప్పటికీ సరిగా వైద్య సేవ లు అందకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి జేబులు గుల్లజేసు కోవా ల్సి వస్తున్నదని పేద కుటుంబాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పట్టిపీడిస్తున్న మందుల కొరత...

మలేరియా, డెంగీ జ్వరాలు విజృంభించడంతో రోగులు ప్రభుత్వాసుపత్రులకు క్యూ కడుతుంటారు.ఇటువంటి తరుణంలో మం దుల కొరత పట్టిపీడిస్తున్నది.అరకొర మం దులతో చుక్కలు చూస్తున్నారు.

ప్రతి చిట్టీలో బయట దొరికే మందులు రాయడం పరిపాటైంది

సర్కారు ఆసుపత్రికి సాధారణంగా పేద కుటుంబాలే ఎక్కువగా వస్తుంటాయి.పేదల కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యా లు అందుబాటులో ఉంటుంటే అందుకు భి న్నంగా హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి పేద కుటుంబాలు వైద్యం కోసం వెళితే కనీ సం పట్టించుకునే నాధుడు లేడు అంటే ఏరి యా హాస్పిటల్ ఏ పరిస్థితిలో ఉందో ఇక అర్థం చేసుకోవచ్చు. 

కాన్పులు అంతంత మాత్రమే...

మాతా, శిశు కేంద్రం విషయానికొస్తే వంద పడకల ఆసుపత్రిలో ఇద్దరే గైనిక్లు ఉన్నారు.కాన్పులు చేయలేక గర్భిణులను వేరే ఆసుపత్రులకు రిఫర్ చేయాల్సి వస్తున్నది.దీంతో పేద ఆడబిడ్డలు ‘ప్రైవేటు’ను ఆశ్రయించక తప్పడం లేదు.గతంలో నర్సు అశ్రద్ధ వలన తల్లీబిడ్డ చనిపోయిన ఘటన రోగులకు గుర్తుకు రావడంతో మాతా,శిశు కేంద్రానికి రావడం కూడా తగ్గింది.గతంలో ఇచ్చిన ‘కేసీఆర్ కిట్లు’ ఇవ్వకపోగా,న్యూట్రిషన్ కిట్లు కూడా ఇవ్వడం లేదు. దీంతో ఎక్కువ మంది ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు.

మూతపడిన ఆక్సిజన్ ప్లాంట్...

వెంటిలేటర్లు లేకపోవడంతో సీరియస్ కేసులు వస్తే బయట ఆసుపత్రులకు పంపిస్తున్నారు.దీంతో సీరియస్ కేసులు వస్తే సూర్యాపేట,ఖమ్మం కు రిఫర్ చేస్తున్నారు. గతంలో ఆక్సిజన్ ప్లాంట్ అందుబాటులో ఉండేది. ఇప్పుడు అది కాస్త పుణ్యమా పాపమా అంటూ మూతపడింది.

గత ప్రభుత్వంలో సకల సౌకర్యాలు...

కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందాయి.‘కేసీఆర్ కిట్లు’ ఇవ్వడంతో మాతా,శిశు విభాగంలో కాన్పులు ఎక్కువ జరిగాయి. ఇప్పుడు ఏ కిట్లూ ఇవ్వడం లేదు. ఆసుపత్రికి వెళ్తే పట్టించుకునే వారేలేరు. డయాలసిస్ కేంద్రం తెచ్చింది గత కేసీఆర్ ప్రభుత్వంలోనే.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆక్సిజన్ లేదు.ఎక్స్రేలు పని చేయడం లేదు.మురుగు కాలువ నీరు బయటకు వచ్చి ఆసుపత్రి అంతా దుర్గంధం వెదజల్లుతున్నది.కొప్పుల సైదిరెడ్డి,మాజీ జెడ్పిటిసి బిఆర్‌ఎస్ పార్టీ హుజూర్ నగర్ నియోజకవర్గ నాయకులు.

ఏరియా హాస్పిటల్ లో మందుల కొరత లేదు...

ప్రభుత్వాసుపత్రిలో మందుల కొరత లేదు. రోగులే మందులు బయటకు రాయండి అని అడుగు తుంటారు..తప్ప మేము బయటకు రాయడం లేదు. వెంటిలేటర్ సమస్య ఉన్న మాట వాస్తవమే.రిపేర్ల కోసం పై అధికారులకు తెలియజేశాం.త్వరలో సమస్య పరిష్కారం అవుతుంది.గైనిక్లు లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది ఉంది.కాన్పులు బాగానే చేస్తున్నాం.

డాక్టర్  వెంకటేశ్వర్లు,డిసి సిహెచ్, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్