3 August, 2026 | 3:22 AM

ముగిసిన దీపారెడ్డి అంత్యక్రియలు

03-08-2026 02:01 AM

రంగారెడ్డి, అగస్టు 2 (విజయక్రాంతి): అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన శ్రీపతి దీపారెడ్డి (42) దుర్మరణం చెందారు. భర్తను ఆఫీసులో దింపి తిరిగి వస్తుండగా, సిగ్నల్ వద్ద వేచి ఉన్న ఆమె కారును వెనుక నుంచి మరో కారు వేగంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రా ణాలు కోల్పోయారు. గతంలో ఆమె ఇచ్చిన అవయవదాన అంగీకారం మేరకు అధికారులు అవయవాలను సేకరించారు.

దీపారెడ్డి మృతదేహం ఆదివారం తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయం ద్వారా చంపాపేట్ డివిజన్, శిఖర ఎంక్లేవ్ కాలనీలోని ని వాసానికి కుటుంబ సభ్యులు తీసుకువచ్చా రు. రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోలి  శ్రీనివాస్ రెడ్డి, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ చై ర్మన్ సూదిని రామ్రెడ్డి, మాడ్గుల మండల పార్టీ అధ్యక్షుడు బట్టు కిషన్రెడ్డి, స్థానిక నేత లు తదితరులు పార్థివదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించా రు. అనంతరం చంపాపేటలోని స్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. దీపా రెడ్డికి భర్త రామకృష్ణారెడ్డి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనతోబంధుమిత్రులో విషాదఛాయలు అలముకున్నాయి.