అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు
నియోజకవర్గాన్ని అభివృద్ధిలో నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతా
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి
అబ్దుల్లాపూర్ మెట్, జూన్ 11: అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. మండల పరిధిలోని లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్, ఎల్బీనగర్ జోన్ నాగోల్ సర్కిల్ పెద్ద అంబర్ పేట్ 52 డివిజన్ లో తారా కన్వెన్షన్ లో చిక్కుల పంపిణీ అధికారులు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు.
తుర్కయంజాల్ డివిజన్ చెందిన 153 మంది, పెద్ద అంబర్ పేట్ చెందిన 140, అబ్దుల్లాపూర్ మెట్ మండలానికి చెందిన 107 మంది లబ్ధిదారులకు ఈ చెక్కులు మంజూరు కాగా.. మొత్తం 400మంది లబ్ధిదారులకు రూ. 4, 46, 400లు చెక్కులను ఎమ్మెల్యే పంపించేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ... రెండున్నరేళ్లలో దాదా పు రూ. 3వేల కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశానని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో కనీవినీ ఎరుగని రీతిలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు. గత 15ఏళ్ల కాలంలో నియోజకవర్గాన్ని ఆగం చేశారని ఆరోపించారు. మిగులు నిధులతో ఏర్పడిన తెలంగాణలో పేదలకు పంచాల్సిన సంపదను ఒకే కుటుంబం దోచుకోవటంతోనే నేడు ఆర్థిక కష్టాలు తలెత్తాయని ఆయన ఆరోపించారు.
కష్టాలు ఉన్నప్పటికీ అభివృద్ధి- సంక్షేమం విషయంలో సమతూకం పాటిస్తూ.... రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నామన్నారు. గతంలో మంత్రులకు సైతం సీఎం అందుబాటులో ఉండేవారు కాదన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ప్రజాసమస్యలపై ఒక్క ఫోన్ కాలం దూరంలో ఉంటారని చెప్పారు. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటున్న పార్టీకే ఫ్యూచర్ లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని నంబర్ వన్ గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చిన ఆయన... తాము చేసే అభివృద్ధిలో ప్రజలు, ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బాటసింగారం కోఆపరేటివ్ బ్యాంకు అధ్యక్షులు కొత్త జైపాల్ రెడ్డి, అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి, ఎంపీడీవో యు శ్రీవాణి, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్య కర్తలు, తదితరులు పాల్గొన్నారు.






