3 August, 2026 | 3:24 AM

‘బేబి’ బోనమెత్తింది!

03-08-2026 02:01 AM

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో అందాల ‘బేబీ’ వైష్ణవి చైతన్య సందడి చేసింది. ఆదివారం జరిగిన లష్కర్ బోనాల ఉత్సవాల్లో భాగంగా ఈ ముద్దుగుమ్మ తళుక్కున మెరిసింది. అమ్మవారిని దర్శించుకుని, సాంప్రదాయ పద్ధతిలో బోనం సమర్పించింది. పట్టుచీర కట్టుకుని, తలపై బోనం ఎత్తుకుని ఆలయానికి వచ్చిన వైష్ణవి చైతన్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో వైష్ణవి చైతన్య పాల్గొన్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వైష్ణవి ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ సరసన ‘ఎపిక్ సెమిస్టర్’లో నటిస్తోంది. యువ దర్శకుడు ఆదిత్య హాసన్ తెరకెక్కిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే పోస్టర్లు, పాటలతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ సినిమా త్వరలో విడుదలకు రానుంది.