డబిల్‌పూర్‌లో ఘనంగా బోనాలు
అమ్మవారికి ఓడి బియ్యం సమర్పించిన గ్రామస్తులు
మేడ్చల్ అర్బన్, ఆగస్టు 2 : ( విజయ క్రాంతి): ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని దబిల్పూర్ గ్రామంలో బోనాలను అత్యంత భక్తిశ్రద్ధల తో ఘనంగా నిర్వహించారు. ము త్యాలమ్మ, మహంకాళి అమ్మ, నల్ల పోచమ్మ అమ్మ వాళ్లకు బోనాలు సమర్పించారు. ముందుగా ఓడి బియ్యం పోశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొ న్నారు. ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ నేతలు రాజ మల్లారెడ్డి, భాగ్యరెడ్డి, దామోదర్ రెడ్డి దంపతులు ముత్యాలమ్మ మహంకాళి అమ్మ నల్ల పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగాడబిల్ పూర్ గ్రామ ప్రజలు సుఖ సంతో షాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని స మృద్ధిగా వర్షాలు కురిసి రైతుల పంటలు బాగా పండాలని కోరుతూ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ ప్రసాద్, సుధాకర్, వినోద్, సాయి స్వరూప్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.






