calender_icon.png 5 February, 2026 | 7:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుల్తానాబాద్ లో న్యాయవాదుల విధుల బహిష్కరణ

05-02-2026 05:56:14 PM

సుల్తానాబాద్, ఫిబ్రవరి 5 (విజయ క్రాంతి):  చేవెళ్ల బార్ అసోసియేషన్ సభ్యురాలు యువ మహిళా న్యాయవాది స్వప్న ను దుండగులు అతి కిరాతకంగా హత్య చేసిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మేకల తిరుపతి రెడ్డి అన్నారు. ఈ దారుణ హత్యకు నిరసనగా గురువారం న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. న్యాయవాదులపై జరుగుతున్న దాడులకు హేయమైన చర్య అని, వారి రక్షణ కోసం ప్రభుత్వం వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొయిని భూమయ్య , న్యాయవాదులు భూసారపు బాల కిషన్ ప్రసాద్, మాడూరి ఆంజనేయులు, పడాల శ్రీరాములు,  ఆకారపు సరోత్తం రెడ్డి, జోగుల రమేష్, చిలుక ఆనంద్, వంగళ యుగేందర్ రెడ్డి, వేముల స్నేహ తదితరులు పాల్గొన్నారు.