16-02-2026 06:29:18 PM
పెద్దపల్లి జిల్లా
సుల్తానాబాద్ లో విధులు బహిష్కరించిన న్యాయవాదులు
సుల్తానాబాద్,(విజయకాంతి): రంగారెడ్డి బార్ అసోసియేషన్ సభ్యుడు అత్తాపూర్ కు చెందిన న్యాయవాది మొహమ్మద్ ఖదీర్ అడ్వకేట్ ను దుండగులు అతిదారుణంగా హత్య చేయడాన్ని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించారు. హత్యకు నిరసనగా సోమవారం స్థానిక కోర్టు న్యాయవాదులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులను బహిష్కరించారు. అనంతరం కోర్టు ఎదుట న్యాయవాదులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మేకల తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఇటీవల న్యాయవాదులపై దాడులు ఎక్కువయ్యాయని, న్యాయవాదుల రక్షణ కోసం ప్రభుత్వం వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
చట్టం తీసుకువచ్చేలా రాష్ట్రప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా కార్యాచరణ మొదలు పెడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బోయిని భూమయ్య, న్యాయవాదులు పడాల శ్రీరాములు, జోగుల రమేష్, పడాల అంజయ్య, సామల రాజేంద్ర ప్రసాద్, ఆవుల శివకృష్ణ, రుద్రారపు నర్సయ్య, చీకటి సంతోష్, దాసరి సత్యనారాయణ, చిలుక ఆనంద్, అంబాల నర్సయ్య, గుడ్ల వెంకటేష్ , వేముల స్నేహ, మడూరి పృథ్వీ, రుద్రారపు శ్యాం సుందర్ , ఆరేపల్లి రాహుల్ తదితరులు పాల్గొన్నారు.