15 July, 2026 | 12:14 AM

నీట్ రెడీ లాప్‌టాప్ ఆవిష్కరణ

15-07-2026 12:14 AM

ఏసర్, ఇంటెల్, ఇన్ఫినిటీ లెర్న్ భాగస్వామ్యం

హైదరాబాద్, జూలై 14(విజయక్రాంతి): దేశంలోనే అతిపెద్ద వైద్య విద్య ప్రవేశ పరీక్ష అయిన ‘నీట్’, 2027వ నుంచి కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ) విధానంలోకి మారనుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులను డిజిటల్ పరంగా సిద్ధం చేసేందుకు గ్లోబల్ టెక్నాల జీ దిగ్గజాలు ఏసర్, ఇంటెల్ సంస్థలతో కలిసి ప్రముఖ విద్యా సంస్థ శ్రీచైతన్య అనుబంధ ‘ఇన్ఫినిటీ లెర్న్’ చేతులు కలిపింది.

దేశంలో మొట్టమొదటి సారిగా ‘నీట్ రెడీ లాప్‌టాప్’, సమగ్ర ఈకోసిస్టమ్‌ను ఈ సంస్థలు సంయుక్తంగా మంగళవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించాయి. కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు మారే తరుణంలో విద్యార్థుల్లో డిజిటల్ నైపుణ్యాలను, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ వినూత్న లాప్‌టాప్‌ను రూపొందించారు. నీట్ ప్రిపరేషన్‌కు కావాల్సిన పూర్తి స్టడీ మెటీరియల్ ఇందులో ముందే లోడ్ చేయబడి ఉంటుంది.

అలాగే అసలైన నీట్ పరీక్ష వాతావరణాన్ని తలపించేలా మాక్ టెస్ట్‌లు, లైవ్‌అండ్ రికార్డెడ్ క్లాసులు చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ టెస్టులు, విద్యార్థుల ప్రతిభను విశ్లేషించే అనలిటిక్స్ ఫీచర్లు కూడా ఈ లాప్‌టాప్‌లో ఉన్నాయి. ఈ లాప్‌టాప్ ఆవిష్కరణ విద్యా రంగంలో సరికొత్త విప్లవమని సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు.

శ్రీ చైతన్య విద్యా సంస్థల సీఈవో అండ్ డైరెక్టర్, ఇన్ఫినిటీ లెర్న్ ఫౌండర్ సుష్మ బొప్పన మాట్లాడుతూ ఏసర్, ఇంటెల్ సంస్థలతో కలిసి మా విద్యా నైపుణ్యాన్ని జోడించి ఈ ఈకోసిస్టమ్‌ను తీసుకురావడం సంతోషంగా ఉందని అన్నారు. ఏసర్ ఇండియా ప్రెసిడెంట్ మేనేజింగ్ డైరెక్టర్ హరీష్ కోహ్లీ మాట్లాడుతూ ఇంటెల్, ఇన్ఫినిటీ లెర్‌నతో కలిసి మేము అందిస్తున్న ఈ లాప్‌టాప్ విద్యార్థుల అభ్యాసనానికి, నిరంతర పురోగతికి ఎంతగానో తోడ్పడుతుందిన్నారు.

ఇన్ఫినిటీ లెర్న్ ఫౌండింగ్ సీఈవో ఉజ్వల్ సింగ్ మాట్లాడుతూ ‘భారతదేశంలో నాణ్యమైన విద్యను అందించడంలో మనం ఎంతో ప్రగతి సాధించామన్నారు. ఇంటెల్ ఏపీజే రీజియన్ వైస్ ప్రెసిడెంట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్ విశ్వనాథన్ ఈ భాగస్వామ్యం ద్వారా పోటీ పరీక్షల భవిష్యత్తు కోసం విద్యార్థులను మేము సిద్ధం చేస్తున్నామని తెలిపారు.