16-02-2026 06:25:23 PM
మాజీ మంత్రి ఎమ్మెల్యే గుంత కండ్ల. జగదీశ్ రెడ్డి
తుంగతుర్తి(విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు కలిసి పనిచేస్తున్నాయని మున్సిపల్ ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు చేశారని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకల్లు జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తిరుమలగిరి మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడింది. అని అన్నారుమున్సిపల్ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ కూడా అధికార పార్టీకి అనుకూలంగా పని చేసిందని ఎద్దేవ చేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియల్ విషయంలో ఎన్నికల కమిషన్ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వివరించడం వింతగా ఉందని అన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుంది.. రాష్ట్రంలోని పేద ప్రజలు కేసీఆర్ ని కోరుకుంటున్నారని దానికి నిదర్శనం గానే మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుపొందామని రానున్న ఎంపీటీసీ జెడ్పిటిసి కైవసం చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాలు లేకుండా చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. తిరుమలగిరిలో మున్సిపల్ ఓటమి కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు లాగా ఉన్నదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాయ హామీలతో గెలిచిందని ఇప్పుడు ఎన్నికలు పెట్టిన మళ్లీ కేసీఆర్ ని కోరుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టే కేసులతో ఒరిగేదేమీ లేదు.రాష్ట్రవ్యాప్తంగా అన్ని దాడులను సహించి తట్టుకుని నిలబడి పనిచేస్తున్న కార్యకర్తలందరికీ ధన్యవాదాలు పేర్కొన్నారు.
నూతనంగా మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఏబోజు గోవిందమ్మలను అభినందించారు. రానున్న ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసే, ఎక్కువ స్థానాలు గెలుపొందాలని కోరారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్, రాష్ట్ర నాయకులు మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్, గుజ్జ యుగంధర్ రావు, కల్లెట్లపల్లి శోభన్ , కొమ్మినేని సతీష్, కల్లెట్లపల్లి ఉప్పలయ్య తాటికొండ సీతయ్య, గుండ గాని రాములు గౌడ్, గౌడ్ చర్ల సత్యనారాయణ గౌడ్, గోపగాని రమేష్ గౌడ్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.