ఖేడ్ జడ్పీహెచ్‌ఎస్‌కు 10 ల్యాప్‌ట్యాప్‌లు అందజేత
నారాయణఖేడ్, జూన్ 24 : ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందించడం కోసం హైదరాబాదులోని అంనెట్ డిజిటల్ సాఫ్ట్వేర్ సంస్థ ప్రాంగణంలో 10 ల్యాప్ టాప్ లను నారాయణఖేడ్ జడ్పీహెచ్‌ఎస్ హెచ్‌ఎం మన్మధ కిషోర్, ఉపాధ్యాయులు రాజశేఖర్,చంద్ర శేఖర్ ఆచార్యలకు బుధవారం అందజేశారు.
సందర్భంగా అంనెంట్ డిజిటల్ సాఫ్ట్వేర్ సంస్థ ప్రతినిధులు సీఈవో కృష్ణ రెడ్డి, సీనియర్ డైరెక్టర్ వల్లి సూర్యదేవర, హర్షిత్ సక్సేన, అభిలాష్, మల్లేశ్వరి, లయన్స్ క్లబ్ సభ్యులు నాగరాజు, అరుణ, మాధవి సూర్య మాట్లాడుతూ ఖేడ్ ప్రభుత్వ పాఠశాలలో 900 మంది విద్యార్థులు చదవడం అభినందనీయమని అలాంటి పాఠశాలకు తమ సేవలు అవసరమని గుర్తించి లయన్స్ సభ్యులు చంద్ర శేఖర్ ఆచార్య కోరిక మేరకు 5 లక్షల విలువగల 10 ల్యాప్ ట్యాప్ లను అంనెంట్ డిజిటల్ సాఫ్ట్వేర్ సంస్థ సహకారంతో అందజేశామని, దీనిని పాఠశాల విద్యార్థుల సద్వినియోగం చేసుకోవాలన్నారు.
రాబోవు రోజులలో పాఠశాల అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అంనెంట్ డిజిటల్ సాఫ్ట్వేర్ సంస్థ ప్రతినిధులు సీఈవో కృష్ణ రెడ్డి, సీనియర్ డైరెక్టర్ వల్లి సూర్యదేవర, హర్షిత్ సక్సేన, అభిలాష్, మల్లేశ్వరి, లయన్స్ క్లబ్ సభ్యులు నాగరాజు, అరుణ, మాధవి సూర్య, ఉపాధ్యాయులు రాజశేఖర్, చంద్ర శేఖర్ ఆచార్య తదితరులు పాల్గొన్నారు.






