25 June, 2026 | 4:40 AM

విద్యే ఉజ్వల భవిష్యత్తుకు పునాది

25-06-2026 12:00 AM
  1. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
  2. అల్ఫోర్స్ పాఠశాలను ప్రారంభించిన ప్రభుత్వ విప్

వేములవాడ, జూన్ 24 (విజయక్రాంతి) : రాజన్న సిరిసిల్ల జిల్లా,వేములవాడ పట్టణంలోని అయ్యప్ప టౌన్‌షిప్‌లో ప్రపంచ ప్రమాణాలతో, అత్యాధునిక వసతులతో నిర్మించిన అల్ఫోర్స్ పాఠశాలను రాష్ట్ర ప్రభు త్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్ట ర్ వి. నరేందర్ రెడ్డి బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రు లు, విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ విద్య అనేది ప్రతి విద్యార్థి జీవితాన్ని తీర్చిదిద్దే శక్తివంతమైన సాధనమని అన్నారు. ప్రాథమిక దశ నుంచే విద్యార్థులు తమ లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలని సూచించా రు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే ది శగా క్రమశిక్షణతో చదువుకోవాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలు కూ డా ఎంతో అవసరమన్నారు.

నరేందర్ రెడ్డి నాయకత్వంలో అల్ఫోర్స్ విద్యాసంస్థలు వి ద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తున్నాయని కొనియాడారు. ప్రతిష్ఠాత్మక విద్యాసం స్థల్లో సీట్లు సాధించడమే కాకుండా విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకు నేలా మార్గనిర్దేశం చేస్తున్నారని ప్రశంసించా రు. విద్యా రంగంలో ఆయన అమలు చే స్తు న్న ప్రణాళికలు ఆదర్శప్రాయమన్నారు. అ ల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. న రేందర్ రెడ్డి మాట్లాడుతూ గత 36 సంవత్సరాలుగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిది ద్దే లక్ష్యంతో అల్ఫోర్స్ విద్యాసంస్థలు పనిచేస్తున్నాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 60 కు పైగా విద్యాసంస్థల ద్వారా నాణ్యమైన విద్య ను అందిస్తూ వేలాది మంది విద్యార్థులను ఉన్న స్థానాలకు చేర్చినట్లు వివరించారు.

విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ వి ద్యార్థు ల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆ హు తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, వ్యవసాయ మార్కె ట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, స్థానిక కౌన్సిలర్ కే.శ్రీనివాస్, పీఎన్‌ఆర్ ఫౌండేషన్ సభ్యు డు సంధి తిరుపతి రెడ్డి, దయ్యాల రాజశేఖర్, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.