పంచాయతీ నిధులు పక్కదారి?
పనులు చేయకుండా నిధులు మాయమా..
వ్యక్తిగత ప్రయోజనం కే నిధుల మళ్లింపు?
పర్యవేక్షణలో లోపంతో అక్రమాలకు తావు
జడ్చర్ల, ఏప్రిల్ 20: పంచాయతీ నిధులు పక్కదారి పడుతున్నాయని ఓ సంస్థ ప్రతినిధులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో అసలు అక్రమాలు నిజమేనా అనే సందేహాలు ఊపందుకున్నాయి. ప్రజాధనాన్ని పక్కదారి పట్టించి నిధులను దారి మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని జడ్చర్ల మండల పరిధిలోని బూర్గుపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. లక్షల రూపాయల అభివృద్ధి నిధులు దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి.
బూర్గుపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధి పనులకు కేటాయించిన నిధులు కాగితాలకే పరిమితమయ్యాయని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సదుపాయాల పేరుతో నిధులు విడుదలైనప్పటికీ, వాటికి సంబంధించిన పనులు ఎక్కడా కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అయితే అధికారిక రికార్డుల్లో మాత్రం పనులు పూర్తయ్యాయని చెబుతున్నారని ప్రజలు చెబుతున్న మాట. ప్రభుత్వం విడుదల చేసే ప్రతి రూపాయి ప్రజల సంక్షేమం కోసం. అయితే వాటిని కాగితాలపైనే ఖర్చు చేసినట్లు చూపించడం ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తోంది.
వ్యవస్థపై ఊపందుకున్న ప్రశ్నలు
జడ్చర్ల నియోజకవర్గం బూరుగుపల్లి గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై డిపిఎల్ విచారణ చేస్తుండ్రు. గ్రామానికి గత నాలుగు సంవత్సరాలలో మొత్తం రూ.1 కోటి 67 లక్షల నిధులు మంజూరు కాగా ,అందులో సుమారు రూ.80 లక్షల వరకు ఖర్చు చేసినట్లు రికార్డుల్లో చూపుతున్నారని గ్రామస్థులు తెలిపారు.
ఈ ఖర్చు చేసిన నిధుల్లోనే పెద్ద ఎత్తున దుర్వినియోగం జరిగిందని గ్రామ ప్రజలు, గరుడ యువసేన సభ్యులు ఆరోపించారు. గుండ్ల పొట్లపల్లి గ్రామానికి చెందిన డ్రైనేజీ పనుల ఫోటోలను బూరుగుపల్లి గ్రామపంచాయతీ పనులుగా చూపిస్తూ నిధులు విత్ డ్రా చేసుకున్నారని, జడ్చర్ల బ్లాక్ కార్యాలయం వెనుక ఉన్న నల్లాల ఫోటోలను ఉపయోగించి కూడా నిధులు డ్రా చేసినట్లు ఆరోపించారు.
గ్రామ అభివృద్ధికై కలెక్టర్ కు గరుడ యువసేన ఫిర్యాదు
గ్రామ పంచాయతీ పరిధిలో 2022-23 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరాలలో రూ.24 లక్షలు అనుమానాస్పద ఖర్చులుగా ఉన్నాయని,ఈ విషయమై విచారణ చేపట్టాలంటూ బూరుగుపల్లి గ్రామానికి చెందిన గరుడ యువసేన ఆర్గనైజేషన్ సభ్యులు మార్చి 28న కలెక్టర్,జిల్లా పంచాయతీ అధికారికి పిర్యాదు చేశారు. అనధికార థరాపార్టీ పేమెంట్లు జరిగాయని,ఎజెండా, తీర్మానాలు లేకుండానే నిధులను వెచ్చించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
గ్రామ పంచాయతీలో నిధులు ఇలా..
భూర్గుపల్లి గ్రామ పంచాయతీలో 15 ఆర్ధిక సంఘం నిధులను పంచాయతీ కార్యదర్శితో పాటు నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఇష్టారాజ్యంగా ఖర్చుచేశారన్న ఆరోపణలు రూపొందుకుంటున్నాయి. గ్రామంలో 2004-20025వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.4 లక్షల అంచనాతో 2024 మార్చి 523 తో మురుగు కాలువ నిర్మించినట్లు ఫొటోను ఆఫ్ లోడ్ చేశారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. అది గత మార్చి 14న గుండ్లపొట్లపల్లి గ్రామంలో జియోట్యాగింగ్తో తీసిన ఫొటో, రెండు రోజుల వ్యవధిలోనే ఈ పనులకు సంబంధించిన పేమెంట్ చేసినట్లు రికార్డులలో నమోదు చేసినట్లు తెలుస్తుంది. గ్రామంలో తాగునీటి సరఫరాకు పైపులైను నిర్మాణానికి రూ.6 లక్షల అంచనాతో 2024 మార్చి 1న పనులు ప్రారంభించారు.
ఇక్కడ కూడా బాదేపల్లిలో గత ఫిబ్రవరి 1న జియోట్యాగింగ్ తీసిన ఫొటోను అప్లోడ్ చేశారని,ఈ పనులకు సంబందించి రూ. 3 లక్షలా 42.228 లను నాలుగు. విడతలుగా పేమెంట్ చేసినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు . ఫొటో అప్లోడ్ చేసిన రోజునే విడతల వారీగా రెండు ఓచర్లతో రూ.లక్షా 69,758 ఒకటి, రూ.లక్షా 1970 మరో పేమెంట్ చేసినట్లు, అలాగే 15 రోజుల వ్యవధిలో అంటే 16 ఫిబ్రవరి 2026న రూ.12. వేలు, మళ్లీ 12 మార్చి 2026 న రూ.28.500 పేమెంట్ చేసినట్లుగా రికార్డులలో నమోదు చేశారని గ్రామస్తులు చెబుతున్న మాట.గ్రామంలో రెండు కుళాయిలు ఏర్పాటు చేసినట్టుగా ఒక ఫొటోను అప్లోడ్ చేశారని తెలుస్తుంది.
ఫొటోను పరిశీలించగా జడ్చర్ల మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఉన్న కుళాయి ఫొటోగా గుర్తించారు. వీటి ఏర్పాటు కు 20 మే 2024న రూ. 14,200 ఒక ఒచర్ తో, అదే రోజు మరో ఓచర్ తో రూ.22,650 పేమెంట్ చేసిన ట్లుగా నమోదు చేశారు.బూర్గుపల్లి గ్రామంలో చాలా అక్రమంగా జరిగినప్పటికీ గరుడ యువసేన అర్బనైజేషన్ తమ గ్రామ అభివృద్ధికై కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన వెంటనే కలెక్టర్ స్పందించి డిపి లోపు కేసులు అప్పగించి గ్రామపంచాయతీలో జరిగిన అవినీతిపై విచారణ చేయిస్తుండ్రు.
కలెక్టర్ ఆదేశాలతో విచారణ షూరూ..
జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో బూరుగుపల్లి గ్రామ పంచాయతీ నిధులకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నాం. వారం పది రోజుల్లో పూర్తి విచారణ చేసి నివేదికను కలెక్టర్ కు అందజేస్తాం.
రాంమోహన్, డీఎల్పీఓ






