మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలేవి?
ఇప్పటి వరకు ఏర్పాటు చేయకపోవడం దారుణం
భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు విఠల్‌రెడ్డి
బీకేఎస్ ఆధ్వర్యంలో రైతులు మహా ధర్నా
గాంధారి, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారిలో బాన్సువాడ- కామారెడ్డి ప్రధాన రహదారిపై నెహ్రూ చౌర స్తా వద్ద మండలంలోని రైతులు సోమవా రం భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు విఠల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని అన్నారు.
మండలంలోని రైతులు ఎక్కువ విస్తీర్ణంలో మొక్కజొన్న సాగు చేస్తారని అధి కారులకు అవగాహన ఉన్నాకూడా ఇప్పటివ రకు మొక్కజొన్న, జొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం చాలా దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చేతికి వచ్చిన పంట వర్షంలో తడిస్తే తమ పరిస్థితి ఏంటని రైతులు ఆందోళన చెందుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నిసార్లు అధికారులకు, ప్రభుత్వా నికి విన్నవించినా రైతుల గోడు పట్టించు కోవడం లేదని ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల సమస్యలు తీర్చాలని ఆయన డిమాండ్‌చేశారు. యూరియా యాప్ రైతుల కు శాపంగా పరిణమించింది అని , యాప్‌పై అవగాహన లేని రైతులు యూరియా ఎలా బుక్ చేసుకుంటారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించి యూరి యా సరఫరా యాప్ ద్వారా కాకుం డా నేరు గా ప్రతీ రైతుకు సరిపడా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.






