హైదరాబాద్‌లో కేవైఎస్ క్లబ్ ప్రారంభం
హైదరాబాద్, జూలై 9 (విజయక్రాంతి): హైదరాబాద్ కొండాపూర్‌లోని కాటలిస్ట్ గ్లోబల్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో మౌక్తిక స్టైల్ అండ్ డిజైన్ భాగస్వామ్యంతో కేవైఎస్ క్లబ్‌ను ప్రారంభించారు. వ్యక్తిగత ఇమేజ్, పర్సనల్ బ్రాండింగ్, ఎగ్జిక్యూటివ్ ప్రెజెన్స్, స్టైల్ ట్రాన్స్ఫర్మేషన్ సేవలను ఒకే వేదికపై అందించడమే ఈ క్లబ్ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉషా యనమంద్ర, కాటలిస్ట్ గ్లోబల్ ఇన్నోవేషన్స్ సహ వ్యవస్థాపకురాలు, మాట్లాడుతూ.. ఈ క్లబ్ వ్యక్తిగత, వృత్తిపరమైన అభివృద్ధికి కొత్త అవకాశాలను కల్పిస్తుందని చెప్పారు.
మౌక్తిక స్టైల్, డిజైన్ వ్యవస్థాపకురాలు పద్మ స్వరూప భగవతుల మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తి తన వ్యక్తిత్వానికి తగిన స్టైల్ను గుర్తించి మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ఈ క్లబ్ దోహదపడుతుందని పేర్కొన్నారు. కేవైఎస్ క్లబ్ ద్వారా ఇమేజ్ కన్సల్టింగ్, పర్సనల్ బ్రాండింగ్, ఎగ్జిక్యూటివ్ ప్రెజెన్స్, వార్డ్రోబ్ ప్లానింగ్, లైఫ్స్టైల్ అడ్వైజరీ వంటి సేవలు అందించనున్నారు. అలాగే, కాటలిస్ట్ గ్లోబల్ ఇన్నోవేషన్స్ మాస్టర్ బిబో (ఎహాబ్ అలీ)తో కలిసి దుబాయ్, స్వీడన్ దేశాల్లో అంతర్జాతీయ కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు వెల్లడించింది.






