10 July, 2026 | 5:14 AM

గంజాయి మత్తులో కొత్తగూడెం యువత

09-07-2026 05:33 PM

3 టౌన్ పోలీసుల అదుపులో ఇద్దరు యువకులు 

కొత్తగూడెం జూలై 9 విజయక్రాంతి:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పి రోహిత్ రాజు(Bhadradri Kothagudem District SP Rohit Raju) ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యల లో భాగంగా,ప్రజల్లో మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడం, ముఖ్యంగా యువత గంజాయి వంటి మత్తు పదార్థాల బారిన పడకుండా రక్షించడం లక్ష్యంగా, విశ్వసనీయ సమాచారం మేరకు కొత్తగూడెం పట్టణంలోని మెదరబస్తీ ప్రాంతంలో కొత్తగూడెం 3 టౌన్ పోలీసులు బుధవారం సాయంత్రం  ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం వారిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, చట్టపరమైన ప్రక్రియలు చేపట్టారు. ఈ ఘటనపై క్రైమ్ నెం.xxx/2026  కేసు నమోదు చేసినట్లు కొత్తగూడెం డిఎస్పి ఆదినారాయణ వెలువరించరు. భవిష్యత్తులో ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం, న్యాయస్థానంలో హాజరుపరిచి డీ-అడిక్షన్ సెంటర్‌కు పంపించనున్నారు. ఈ సందర్భంగా కొత్తగూడెం డిఎస్పి మాట్లాడుతూ, మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసు శాఖ పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని, గంజాయి కొనుగోలు, విక్రయం, రవాణా, నిల్వ, వినియోగం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, విద్యాసంస్థల యాజమాన్యాలు, ప్రజలు మాదకద్రవ్యాలకు సంబంధించిన అనుమానాస్పద సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-112 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని తెలిచేసారు.