4 May, 2026 | 3:19 PM

Breaking News

ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం   •   కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •   కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత లేదు: ఎండీ ఖాజా భక్ష్   •   అగ్ని ప్రమాదంలో 44 లక్షల పంట నష్టం 47 ఎకరాల్లో దగ్ధం   •   అకాల వర్షాలతో కొమరారం కేంద్రంలో తడిసిన మొక్కజొన్న   •  

టర్కీ పార్లమెంట్‌లో తన్నులాట!

13-02-2026 12:00 AM
  1. ఎంపీల మధ్య తీవ్ర ఘర్షణ.. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు
  2. కొత్త న్యాయశాఖ మంత్రి నియామకంపై ప్రతిపక్షాల ఆగ్రహం
  3. మంత్రి ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకోవడంతో తోపులాట

అంకారా, ఫిబ్రవరి 12:  టర్కీ (తుర్కియే) పార్లమెంటు రణరంగాన్ని తలపించింది. కొత్తగా న్యాయశాఖ మంత్రి నియామకం తీవ్ర వివాదానికి దారితీయడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యుల మధ్య తీవ్ర స్థాయి లో ఘర్షణ జరిగింది. ఎంపీలు ఒకరిపై ఒక రు పిడిగుద్దులు కురిపించుకుంటూ, తోపులాటకు దిగడంతో సభలో తీవ్ర గందరగో ళం నెలకొంది.

అధ్యక్షుడు ఎర్డోగాన్ ఇటీవల క్యాబినెట్‌లో మార్పులు చేసి, వివాదాస్పద అధికారి అకిన్ గుర్లెక్‌ను కొత్తగా న్యాయశాఖ మంత్రిగా నియమించారు. ఆ యన ప్రమా ణ స్వీకారం చేసేందుకు పోడి యం వద్దకు వస్తుండగా ప్రతిపక్ష రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీం తో అధికార ఏకే పార్టీ సభ్యులు వారిని నిలువరించబోగా, ఇరువర్గాల మధ్య వాగ్వాదం పెరిగి తోపులాట, ఘర్షణకు దారితీసింది.

ఘర్షణల నేపథ్యంలో పార్లమెంట్ స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశా రు. విరామం అనంతరం, అధికార పార్టీ ఎంపీలు గుర్లెక్‌ను రక్షణగా నిలబడగా ఆయన ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు. గతంలో  గుర్లెక్  ఇస్తాంబు ల్ మేయర్ ఎక్రె మ్ ఇమామోగ్లుపై రాజకీయ ప్రేరేపిత కేసు లు పెట్టారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.