calender_icon.png 13 February, 2026 | 10:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతిపక్ష నేత సభ్యత్వం రద్దు చేయండి

13-02-2026 12:00:00 AM

  1. రాహుల్‌గాంధీపై జీవిత కాలం నిషేధం విధించాలి
  2. బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే నోటీసు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12:  కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే గురువారం నోటీసు ఇచ్చారు. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టే ఉద్దేశంతో ఆ నోటీసు జారీ చేశానన్నారు. పార్లమెంట్ ఆవరణలో  మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు.

రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్తున్నారని, సోరస్ ఫౌండేషన్, యూఎస్‌ఏఐడీ, ఫోర్డ్ ఫౌండేషన్ లాంటి సంస్థలతో చేతులు కలిపి.. దేశానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నట్లు దూబే ఆరోపించారు. ఇదేమీ ప్రివిలేజ్ మోషన్ కాదని, సబ్‌స్టాంటివ్ మోషన్  నోటీసు ఇస్తున్నానని బీజేపీ ఎంపీ వెల్లడించారు.

విదేశీ ఫౌండేషన్లతో జతకట్టిన రాహుల్ గాంధీ.. వియత్నాం, కంబోడియా, థాయ్‌లాండ్ దేశాలకు పర్యటిస్తున్నట్లు ఆరోపించారు. రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని, జీవితకాలం ఎన్నికల్లో పోటీ చేయండా నిషేధం విధించాలని తన నోటీసులో డిమాండ్ చేసినట్లు ఎంపీ దూబే పేర్కొన్నారు. 

సభా హక్కుల తీర్మానానికి కేంద్రం విముఖత 

ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై సభా హక్కుల తీర్మానానికి కేంద్రం విముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ బీజేపీ ఏంపీ నిషికాంత్ దూబే గురువారం లోక్‌సభలో ’సబ్‌స్టాంటివ్ మో షన్’ దాఖలు చేశారు. రాహుల్ పార్లమెంట్ సభ్యత్వంతో పాటు, జీవితాంతం ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషే ధం విధించాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీ ప్రవేశపెట్టిన ఆ తీర్మానంపై కేంద్రం విముఖంగా ఉన్నట్టు సమాచారం.