7 May, 2026 | 1:14 AM

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి

07-05-2026 12:23 AM

కూసుమంచి, మే 6(విజయక్రాంతి): మండలంలోని ముత్యాలగూడెం గ్రామానికి చెందిన పాసిని నాగేశ్వరరావు గౌడ్ - స్వరూప దంపతుల కుమార్తె చాతుర్య, మామిడి సీతారాములు గౌడ్ - సత్యవతి దంపతుల కుమారుడు ఉదయ్ కుమార్ ల వివాహ వేడుక బుధవారం పాలేరులోని బీవీ.రెడ్డి ఫంక్షన్ హాల్లో జరగగా...ఈ వేడుకకు ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి హాజరై.. అక్షింతలు వేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారి కుటుంబ సభ్యులతో కొద్దిసేపు ముచ్చటించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సుడిగాలి కిషన్ రావు, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మంకెన వాసు, కాంగ్రెస్ నాయకులు జూకూరి గోపాలరావు, బజ్జూరి వెంకటరెడ్డి, బాలకృష్ణారెడ్డి, బెల్లంకొండ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.