30 July, 2026 | 1:09 AM

38 కేసుల్లో లభించిన 63.621 కిలోల గంజాయి, గంజాయి మొక్క దహనం

30-07-2026 12:08 AM

కరీంనగర్ క్రైం, జూలై 29 (విజయ క్రాంతి): కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 38 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 63 కిలోల 621 గ్రాముల గంజాయి, 1 గంజాయి మొ క్కను పోలీసులు ధ్వంసం చేశారు. బుధవా రం మానకొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈదులగట్టెపల్లి గ్రామంలో ఉన్న వెంక టరమణ ఇన్సినేటర్లో పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం సమక్షంలో డ్రగ్ డిస్పోసల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ గంజాయిని దహనం చేశా రు.

ఈ కార్యక్రమంలో ఏసీపీలు శ్రీనివాస్ జి, వెంకటస్వామి ఇన్స్పెక్టర్లు రఫీక్, శ్రీలత, ఆర్‌ఐలు రజినీకాంత్, శ్రీధర్ రెడ్డి, ఇన్సినరేటర్ ప్లాంట్ కు చెందిన తిరుపతి, ప్రభాకర్ రెడ్డి, ఇతర అధికారులు,పాల్గొన్నారు.