24 February, 2026 | 8:06 PM

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు

24-02-2026 04:12 PM

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్(Union Cabinet) సమావేశం జరిగింది. కొత్త ప్రధానమంత్రి కార్యాలయ సముదాయం సేవా తీర్థంలో తొలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేరళ పేరును కేరళంగా మారుస్తూ కేంద్రం కీలక ప్రకటన  చేసింది. దేశవ్యాప్తంగా బాలికలకు ఉచితంగా హెచ్ పీవీ వ్యాక్సినేషన్(HPV vaccination) వేయనున్నట్లు ప్రకటించింది. 14 ఏళ్ల బాలికలకు ఉచితంగా గర్దాసిల్ ఇంజెక్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. రూ. 1667 కోట్లతో శ్రీనగర్ ఎయిర్ పోర్టులో టెర్మినల్ భవన నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ. 1067 కోట్లతో అహ్మదాబాద్ మెట్రో విస్తరణకు ఆమోదం తెలిపింది. విద్యుత్ రంగంలో సంస్కరణలు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. రూ. 5,236 కోట్లతో గోండియా-జబల్ పూర్ డబ్లింగ్ లైన్ విస్తరిస్తున్నట్లు కేబినెట్ ప్రకటించింది.

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, "ఈరోజు మంత్రివర్గం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలలో, మొదటి నిర్ణయం కేరళ పేరును కేరళగా మార్చడం. మరొకటి గోండియా-జబల్‌పూర్ రైల్వే లైన్‌ను రెట్టింపు చేయడం. బీహార్‌లోని పునారఖ్-కియుల్ నుండి మూడవ, నాల్గవ రైల్వే లైన్లు, జార్ఖండ్‌లోని గమ్హారియా-చండిల్ నుండి మూడవ, నాల్గవ లైన్లు. శ్రీనగర్‌లో కొత్త ఇంటిగ్రేటెడ్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్, అహ్మదాబాద్ మెట్రో పొడిగింపు, విద్యుత్ రంగంలో ఒక ప్రధాన విధాన నిర్ణయం, ముడి జనపనార ఎంఎస్పీపై నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు, రూ.12,236 కోట్ల విలువైన నిర్ణయాలు, రెండు ప్రధాన విధాన నిర్ణయాలు తీసుకోబడ్డాయి." అని ఎక్స్ లో పేర్కొన్నారు.