calender_icon.png 24 February, 2026 | 3:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిరుమల లడ్డూ కల్తీపై ఏపీ అసెంబ్లీలో చర్చ

24-02-2026 02:05:47 PM

అమరావతి: తిరుపతి లడ్డూ నెయ్యి కల్తీపై( Tirumala Laddu Ghee Adulteration) మంగళవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక చర్చను నిర్వహించింది. ఈ అంశం వేలాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. పవిత్రమైన సంప్రదాయం వివాదాస్పదంగా మారిందని తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ దేవాదాయ శాఖ మంత్రి ఎ. రాంనారాయణ రెడ్డి చర్చను ప్రారంభించారు. సభలో ప్రసంగిస్తూ ఆయన మాట్లాడుతూ, "పవిత్ర ఆలయ ప్రసాదం (నైవేద్యం) యొక్క స్వచ్ఛతను వివరించాల్సిన పరిస్థితి తలెత్తడం విచారకరం" అని అన్నారు. సామాన్యులకు అందించే లడ్డూను కల్తీ చేయడం భక్తులను బాధపెడుతుందని ఆయన చెప్పారు. లడ్డూ కల్తీపై అంతా ఆవేదన చెందుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chief Minister Chandrababu Naidu) అన్నారు. గత పాలకులు ఆలయాలపైదాడులు జరిగినా పట్టించుకోలేదని ఆరోపించారు.

గత ప్రభుత్వం హయాంలో అందరూ బాధితులే అన్నారు. 2024లో సీఎం అయిన వెంటనే టీటీడీ ప్రక్షాళనపై దృష్టి పెట్టామని తెలిపారు. తన దృష్టికి వచ్చిన ఎన్డీడీబీ రిపోర్టు వివరాలు వెల్లడించినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. తనకు వెంకటేశ్వరస్వామి పునర్జన్మ ప్రసాదించారని చంద్రబాబు(CM Chandrababu) వెల్లడించారు. బ్రిటిష్ పాలకులు కూడా తిరుమల జోలికి వెళ్లలేదని ఆయన తెలిపారు. లడ్డూ కల్తీలో కుట్ర కోణం ఉందని స్పష్టం చేశారు. 59.71 లక్షల కేజీల కల్తీ నెయ్యిని లడ్డూలో వాడారు, రూ. 234.51 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని వివరించారు. 2024 జులై ఎన్డీడీబీ రిపోర్ట్(NDDB Report) నెయ్యిలో జంతు కొవ్వు ఉందని పేర్కొంది. ఆ రిపోర్టు ఆధారంగానే అప్పట్లో తాను మాట్లాడినట్లు చెప్పారు. 2022లో నెయ్యి కల్తీ జరిగిందని సీఎఫ్టీఆర్ఐ రిపోర్టు స్పష్టం చేసిందన్నారు. అప్పట్లోనే దీనిపై వీళ్లు చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదన్నారు. ఓ పద్దతి ప్రకారం లాలూచీపడి లూటీకి పాల్పడ్డారని చంద్రబాబు ద్వజమెత్తారు.

2019-24 మధ్య రాష్ట్రంలోని అనేక ఆలయాలపై దాడులు జరిగాయని చెప్పిన చంద్రబాబు తిరుమలకు ఏ మతస్థులైనా రావొచ్చన్నారు. అన్యమతస్థులు శ్రీవారి దర్శనానికి వస్తే డిక్లరేషన్ ఇవ్వాలన్నారు. అధికారంలో ఉన్నామని ఈ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించారని పేర్కొన్నారు. దివంగత వైఎస్ఆర్ ఉన్నప్పుడే ఈ రకమైన చర్యలు మొదలయ్యాయని సూచించారు. తిరుమల శ్రీవారివి ఏడుకొండలు కాదు రెండు కొండలు మాత్రమే అని వైఎస్ఆర్ హయాంలో జీవీ ఇచ్చారని స్పష్టం చేశారు. దీనిపై రెండేళ్లపాటు ఆందోళనలు జరిగితే వెనక్కి తగ్గారని గుర్తుచేశారు. వెంకటేశ్వరస్వామికి అపచారం చేస్తే ఈ జన్మలోనే శిక్ష తప్పదని చంద్రబాబు హెచ్చరించారు. వైఎస్ఆర్ హయాంలో పద్మావతి యూనివర్సిటీకి(Sri Padmavati University) ఓ క్రిస్టియన్ ను వైస్ ఛాన్సలర్ గా నామినేట్ చేశారని చెప్పారు. అప్పట్లో దీనిపై కూడా పోరాటం చేశామన్నారు.