18-02-2026 01:55:08 PM
మోతె,(విజయక్రాంతి): మండల పరిధిలోని నేరడవాయి గ్రామంలో తెలంగాణ సాధకుడు రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి కేసిఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మంగళవారం మండల సీనియర్ నాయకులు (కండక్టర్) వెంకన్న ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి బానా సంచా కాల్చి వేడుకలు నిర్వహించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ, కేసిఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని వారు ధీమా వ్యక్తం చేశారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో జీవించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ ముప్పాని మమత శ్రీధర్ రెడ్డి, ఉప సర్పంచ్ కొచ్చర్ల సుజాత శ్రీను, గోపతండ గ్రామ శాఖ అధ్యక్షుడు బోజ్యా (బాబు), గ్రామ కార్యదర్శి హనుమా చారి, వార్డ్ మెంబర్లు పాపారావు, కొచ్చర్ల చంద్రయ్య, కొచ్చర్ల శ్రీరంగం మునగాల రామస్వామి, గ్రామ కోశాధికారి డాక్టర్ శ్రీను, మునగాల మల్లయ్య, మునగాల ఉప్పయ్య, మునగాల మహేష్, జల్లేట్, మునగాల బిక్షం, తుడుం వెంకటేశ్వర్లు, దేవదానం, టి. లక్ష్మయ్య, సాయిలు, యువ నాయకుడు మునగాల నరేష్ తదితరులు పాల్గొన్నారు.