6 July, 2026 | 1:52 AM

పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే, భక్తులు

06-07-2026 12:37 AM

నిర్మల్ జులై 5 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా శ్రీ జ్ఞాన సరస్వతి బాసర అమ్మవారి ఆలయంలో ఆలయ పునర అభివృద్ధి పనులు ప్రా రంభమైన నేపథ్యంలో ఆదివారం బాలాలయంలో సరస్వతి మాత భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయమే ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ దాతలు పద్మప్రియ సునంద్ ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవ విగ్రహాలను బాల మందిరానికి తరలించారు. శాస్రోత్తకంగా పూజలు నిర్వహించి భక్తులకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి దర్శనం కల్పించారు. ఇకనుండి అమ్మవారు బాల మందిరంలోని భక్తులకు దర్శనం ఇవ్వన్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.