29 May, 2026 | 2:04 AM

ఎన్‌టీఆర్‌కు జూనియర్ ఎన్‌టీఆర్ నివాళి

29-05-2026 12:14 AM

దేశం గర్వించదగ్గ నాయకుడు ఎన్‌టీఆర్

సికింద్రాబాద్, మే28 (విజయక్రాంతి): గొప్ప మహానుభావుడు,గొప్ప నటుడు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచి యుగ పురుషుడిగా చరిత్రలో నిలిచిన మహోన్నతమైన వ్యక్తి అని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు.

గురువారం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ దగ్గర వాతావరణం ఎప్పుడూ కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అయితే గురువారం ఉదయం ఒక్కసారిగా హడావుడి కనిపించింది. ఎన్టీఆర్ ఘాటులో తారక్.. తన తాత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా తారక్ అక్కడికి వచ్చారు.

గురువారం ఉదయం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ దగ్గర తన అన్నయ్య కళ్యాణమ్ కలిసి ఆయన పూలమాలలు వేసి తాతకు దండం పెట్టుకున్నారు. ప్రతి ఏడాదీ జూ.ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి కచ్చితంగా వస్తారు కాబట్టి, ఆయన్ను చూసేందుకు అభిమానులు భారీగా అక్కడికి చేరుకున్నారు. చుట్టూ వందలాది మంది అభిమానులతో ఆ ప్రాంతం అంతా కోలాహలంగా మారిపోయింది.