29 May, 2026 | 1:17 AM

అర్ధరాత్రి ఆకతాయిల హల్‌చల్!

29-05-2026 12:18 AM
  1. ఆమనగల్లులో పడకేసిన పోలీస్ పెట్రోలింగ్!
  2. కాలనీల్లో చెలరేగుతున్న గంజాయి బ్యాచ్‌లు 
  3. పెచ్చుమీరుతున్న కత్తి సంస్కృతి
  4. బహిరంగంగానే మత్తు పదార్థాల విక్రయాలు.. 
  5. బెంబేలెత్తుతున్న పట్టణ ప్రజలు

ఆమనగల్లు, మే 28 (విజయక్రాంతి): ఆమనగల్లు పట్టణంలో శాంతిభద్రతల పరిస్థితి నానాటికీ ఆందోళనకరంగా మారుతోంది. ఒ కప్పుడు ప్రశాంతతకు మారుపేరైన ఈ ప్రాంతం, ఇప్పుడు అ ర్ధరాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాల కు అడ్డాగా మా రుతోంది. పట్టణంలోని ప లు కాలనీలు, శి వారు ప్రాంతాలు చీకటి పడితే చాలు ఆకతాయిల రాజ్యంగా మారుతున్నాయి. తాజాగా బస్టాండ్ పార్కింగ్ వివాదంలో జరిగిన కత్తిపోట్ల దాడి ఘటనే దీనికి సజీవ సా క్ష్యం. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలోనే ఇలా జరిగిందంటే పట్టణంలో నేర సంస్కృ తి ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు.

మత్తు కోరల్లో యువత.. కాలనీలకు నిద్రలేని రాత్రులు..

పట్టణంలోని ప్రధాన కూడళ్లతో పాటు అంతర్గత కాలనీల్లో అర్ధరాత్రి దాటిన తర్వా త ఆకతాయిల హల్చల్ మితిమీరిపోతోంది. పట్టణ శివార్లలోని నిర్మానుష్య ప్రాంతాలు, నూతన లేఅవుట్లు (వెంచర్లు) గంజాయి వి క్రయదారులకు, వినియోగదారులకు సురక్షిత స్థావరాలుగా మారాయి.

మత్తుపదార్థా లకు బానిసలవుతున్న కొందరు యువకు లు వివేకం కోల్పోయి చిన్న చిన్న విషయాలకే గ్రూపులుగా విడిపోయి దాడులకు తెగబడుతున్నారు. అర్ధరాత్రి అసభ్యకర పదజాలంతో బూతు పురాణాలు అందుకోవ డం, బైక్‌ల సైలెన్సర్లు తీసేసి రేసింగ్లకు దిగడంతో కాలనీవాసులు గుండెచేత్తో పట్టుకుని బతకాల్సి వస్తోంది. పిల్లలు, వృద్ధులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. పోలీస్ ని ఘాపై వెల్లువెత్తుతున్న విమర్శలు, ఈ ఉదంతాలు అన్నీ ఆమనగల్లులో శాంతిభద్రతల పరిరక్షణ, పోలీస్ పెట్రోలింగ్ వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతున్నాయి.

బాధితుల ఆవేదన..

గతంలో ఎన్నడూ లేని విధంగా పట్టణంలో కత్తులు దూసే సంస్కృతి పెరిగింది. ఏదైనా గొడవ జరుగుతుంటే అడ్డుకోవడానికి కూడా ప్రజలు భయపడుతున్నారు. పోలీసులు ఫిర్యాదుల కోసం వేచి చూడకుండా, నేరాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి.

తక్షణమే కఠిన చర్యలు అవసరం

ఆమనగల్లు పట్టణాన్ని అసాంఘిక శక్తుల నుండి కాపాడాలంటే పోలీస్ ఉన్నతాధికారులు తక్షణమే రంగంలోకి దిగాలి. గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణా, విక్రయాలపై కఠినమైన నిఘా ఉంచి ’స్పెషల్ డ్రైవ్’లు నిర్వహించాలి. యువతకు కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి.  ప్రతి కాలనీకి రాత్రి వేళల్లో కచ్చితంగా పోలీస్ వాహనాలు (బ్లూ కోలట్స్/పెట్రోలింగ్ కార్లు) తిరిగేలా ప్రణాళిక రూపొందించాలి. స్థానిక యువత, కాలనీ వాసులతో కమిటీలు వేసి, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై పోలీసులకు సమాచారం ఇచ్చేలా సమన్వయం పెంచాలి. శాంతిభద్రతలు సజావుగా ఉంటేనే పట్టణం అభివృద్ధి చెందుతుందని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆమన గల్లు ప్రజలకు భద్రతా భావాన్ని కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.