తెలంగాణలో పోలీసు పాలనా?
29-08-2026 12:00 AM
- సూర్యాపేటలో పోలీసుల దౌర్జన్యంపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం
- కారకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్
హైదరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి): తెలంగాణలో ఉన్నది ప్రభుత్వమా? లేక పోలీసు పాలనా? రేవంత్‌రెడ్డి అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేటలో పోలీసుల దౌర్జన్యంపై ‘ఎక్స్’లో హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న మహబూబాబాద్‌లో ఓ పోలీసు అధికారి పాలిటెక్నిక్ విద్యార్థి గొంతు పిసికి క్రూరంగా ప్రవర్తించారని ఇలాంటి ఘటన లకు కారకులైన పోలీసులపై సమగ్ర విచారణ జరిపించాలని వారిపై తక్షణమే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.






