2 May, 2026 | 9:24 PM

Breaking News

ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా శ్రీకాంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం   •   విద్యార్థుల భవిష్యత్తును ఉపాధ్యాయులు బాధ్యతగా తీసుకోవాలి   •   మెట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం   •   సింగరేణి శైలో బంకర్ బాధితులకు ప్రభుత్వ అండ   •   బాధ్యతలు స్వీకరించిన నూతన మెజిస్ట్రేట్ అరుణ్ కుమార్   •   బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పించిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •   అడవులలో లభించే ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన గిరిజన మార్చ్ ప్రజలకు ఎంతో ఉపయోగం   •   25 ఏళ్లుగా సేవలందిస్తున్న డా.మురళీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు   •   ఎస్సెస్సీ ఫలితాల్లో సత్తా చాటిన నూకలమర్రి ఉన్నత పాఠశాల విద్యార్థులు   •   తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా యంజాల కీర్తన ప్రమాణ స్వీకారం   •  

ఆస్తి పన్ను వసూళ్లపై ఉక్కుపాదం

20-02-2026 12:03 AM
  1. మొండి బకాయిలపై చర్యలు
  2. రంగంలోకి జోనల్ కమిషనర్లు

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరంలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లు  ఆస్తి పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియడానికి సమయం దగ్గరపడుతుండటంతో, లక్ష్యానికి దూరంగా ఉన్న వెయ్యి కోట్ల రూపాయల బకాయిలను రాబట్టేందుకు అధికారులు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.

ఏళ్ల తరబడి మొండి బకాయిలు పేరుకుపోయిన ప్రభుత్వ ఆస్తులను లక్ష్యంగా చేసుకుని, వచ్చే నెల ఒక టో తేదీ నుంచి నోటీసులు జారీ చేసేందుకు మున్సిపల్ యంత్రాంగం రంగం సిద్ధం చే సింది.మొండి బకాయిల వసూళ్ల కోసం ప్ర భుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వ న్ టైమ్ సెటిల్‌మెంట్ పథకాన్ని ప్రజల్లోకి తీ సుకెళ్లాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. కేవలం 10 శాతం వడ్డీతో అసలు పన్ను చె ల్లించే వెసులుబాటు ఉన్నప్పటికీ, చాలా మంది బకాయిదారులు ముందుకు రాకపోవడంపై అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.