calender_icon.png 20 February, 2026 | 8:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోవర్టుల వల్లే ఓటమి

20-02-2026 12:03:00 AM

  1. కేసీఆర్ తనకు తానే శిక్ష వేసుకున్నాడు 

కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి 

హైదరాబాద్, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి) : మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో మామీద బాధ్యత మరింత  పెరిగిందని భువనగిరి ఎంపీన చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. తన  పార్లమెంట్  పరిధిలో రెండు మున్సిపాలిటీల్లో ( చేర్యాల, తిరుమల గిరి) కోవర్టుల వల్లే  ఓడిపోయామన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడు తూ మున్సిపాలిటీలలో నాయకులు, కార్యకర్తలకు మధ్య గ్యాప్ ఉండటంతో పాటు అక్క డ ఉన్న నాయకులు కోవర్టులాగా మరారని ఆయన తెలిపారు. ఓడిపోయిన మున్సిపాలిటీల్లో వాస్తవాలు తెలుసుకున్నాక పార్టీ ఓట మికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కేసీఆర్ ప్రతిపక్ష పాత్ర పోషించకుం డా ఫామ్ హౌస్ లో పడుకున్నాడని, 2023 నుంచి ఆరు సార్లు కేసీఆర్ ఘోరంగా ఓటమి చెం దారని విమర్శించారు.  కేసీఆర్ లక్కీ నెంబర్ ఆరు అని,  ఆరు కీలకమైన కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఓడిపోయాడని తెలి పారు.  మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ దెబ్బ కు హరీశ్‌రావు మైండ్ బ్లాక్ అయ్యి మతిస్థితిమితం కోల్పోయారని ఆయన విమర్శిం చారు. పదేళ్ల బీఆర్‌ఎస్ హయాంలో ఏమి చేశారని ఆయన నిలదీశారు. ఇప్పటి వరకు తెలంగాణలో జరిగిన రెండు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు గుండు సున్నా వచ్చింద ననారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను జైలుగా చేసుకుని అక్కడనే శిక్ష వేసుకున్నారని  ఎద్దేవా చేశారు.