17 July, 2026 | 2:56 AM

కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్

17-07-2026 02:41 AM

భూపాలపల్లి, జూలై 16 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గురువారం డా. బి.ఆర్. అంబేద్కర్ సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా త్రాగునీటి సరఫరా, సీజనల్ వ్యాధుల నియంత్రణ, విద్యా పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు, పౌర సరఫరాలు, ప్రజా పాలన తదితర అంశాలపై సమీక్ష చేపట్టారు. ఐడీఓసీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఈ వీడియో సమావేశంలో పాల్గొన్నారు.