5 March, 2026 | 4:48 AM

ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా

05-03-2026 02:29 AM
  1. తాత్కాలిక బాధ్యతలు చేపట్టిన ఖమేనీ కుమారుడు

త్వరలోనే మతాధికారుల కౌన్సిల్ ద్వారా శాశ్వత సుప్రీంగా ఎన్నిక 

టెహ్రాన్, మార్చి 4: అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ స్థానంలో ఆయన కుమారుడు మొజ్తాబా హుస్సేన్ ఖమేనీ కొత్త సుప్రీం లీడర్‌గా ఎన్నికయ్యారు. ఇరాన్‌లోని అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ ఆయనను తదుపరి సుప్రీంగా ఎంపిక చేసింది. 36 సంవత్స రాల పాటు దేశాన్ని పాలించిన ఆయతుల్లా ఖమేనీ ఫిబ్రవరి ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్‌దాడిలో మృతి చెందా రు.

ఆయనతోపాటు కుమార్తె, అల్లుడు, మనుమరాలు ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలైన ఆయన భార్య మాన్సూరె భోజస్తే బఘర్దాదే మరణించారు. ఖమేనీ అంత్యక్రియలు మస్తామ్‌లో నిర్వహించనున్నట్లు ఇరాన్ విప్లవ గార్డులు ప్రకటించారు. రాజధాని టెహ్రాన్‌లో భారీ వీడ్కోలు కార్యక్రమం జరగనుంది. అయతుల్లా అలీ అరఫీ, అధ్యక్షుడు డమసూద్ మసూద్ పెజెషియన్, కెజెప్షియన్, ప్రధాన జడ్జి ఘోలం హోస్సేన్ ఏజేయితో కూడిన తాత్కాలిక మండలి బాధ్యతలు నిర్వ హించింది.

ఎవరీ మోజ్తబా ఖమేనీ..

అయతుల్లా అలీ ఖమేనీ రెండో కుమారుడే మోజ్తబా ఖమేనీ. 1969లో మషాద్ నగరంలో జన్మించిన మోజ్తబా ఖమేనీ, చిన్నతనం నుంచే మతపరమైన విద్యను అభ్యసిం చారు. ఇరాన్-, ఇరాక్ యుద్ధం చివరి దశలో ఆయన రివల్యూషనరీ గారడ్స్ లో పనిచేశారు. దీనివల్ల ఆయనకు సైనిక, పారామి లిటరీ దళాలతో బలమైన సంబంధాలు ఉన్నాయి. మోజ్తబా ఎప్పుడూ ప్రత్యక్షంగా ప్రభుత్వ పదవులు నిర్వహించలేదు.

కానీ, తన తండ్రికి అత్యంత నమ్మకమైన సలహాదారుగా ఉంటూ, ఇరాన్ కీలక నిర్ణయాల్లో తెరవెనుక చక్రం తిప్పేవారని చెబుతుంటారు. 2009లో ఇరాన్‌లో జరిగిన భారీ నిరసనల సమయంలో మోజ్తబా పేరు మొదటిసారిగా అంతర్జాతీయ స్థాయిలో చర్చకు వచ్చింది. ఆ నిరసనలను కఠినంగా అణచివేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. 1979 ఇస్లామిక్ విప్లవం ప్రధానంగా ‘రాజవంశ పాలన’కు వ్యతిరేకంగా జరిగింది.

ఇప్పుడు మళ్లీ తండ్రి తర్వాత కుమారుడే అత్యున్నత పదవిని చేపట్టడం ఇరాన్ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది. కొందరు దీనిని విప్లవ ఆదర్శాలకు విరుద్ధమని భావిస్తుండగా, సైనిక మద్దతు మాత్రం మోజ్తబాకు బలంగా ఉందని చర్చించుకుంటున్నారు. కొత్త సుప్రీం లీడర్ నాయకత్వంలో ఇరాన్ ఇప్పుడు ఏ దిశగా సాగుతుంది, అమెరికా దాడులకు మోజ్తబా ఎలా స్పందిస్తారు, అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.

2019లో మోజ్తబా ఖమేనీపై ఆంక్షలు

ప్రభుత్వ పదవి లేకపోయినప్పటికి తండ్రి తరఫున మొజ్తాబా స్వయంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడన్న కారణంతో 2019లో యూఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ ఆయనపై ఆంక్షలు సైతం విధించింది. ఇరాన్ బ్యాంకిం గ్ వ్యవస్థ ఆయన గుప్పిట్లోనే ఉండేదన్న విమర్శలు ఉన్నాయి. అయితే, గత సంవత్సరం దివంగత సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ తన వారసులు అయ్యే అవకాశం ఉన్న వారి పేర్ల జాబితాను తయారు చేశారు.

ఆ జాబితాలో మొజ్తాబా పేరు లేకపోవటం గమనార్హం. అయితే, ఖమేనీ హత్యతో ఊహించని విధంగా ఖమేనీ వారసుడిగా మొజ్తాబా పేరు తెరపైకి వచ్చింది. రివల్యూషనరీ గారడ్స్‌లో ఉన్న సంబంధాల కారణంగా మొజ్తాబానే సుప్రీం లీడర్‌గా ఎంపికైనట్లు సమాచారం.  

ఎవరు ఎంపికైనా టార్గెట్ చేస్తాం!

ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ప్రకటన

ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్‌గా ఎంపికయ్యే వ్యక్తిని కూడా నిర్మూలించడమే లక్ష్యంగా పెట్టుకుంటామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి అజీజ్ నాజీర్‌దేహ్‌సంచలన ప్రకటన చేశారు. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా జరిపిన దాడిలో సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే. ఖమేనీ మృతిచెంది ఐదు రోజులైనా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఆపడం లేదు. ఇలాంటి సమయంలో ఇజ్రాయెల్ మంత్రి నుంచి ఈ కీలక ప్రకటన వచ్చింది.

ఇజ్రాయెల్‌ను నాశనం చేయాలనుకునే వారిని, అమెరికాను బెదిరించే ప్రయత్నం చేసే వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఈ ప్రాంతంతో పాటు ప్రపంచ దేశాలను అణచివేయడానికి, బెదిరించడానికి ఆ దేశ ప్రభుత్వం నియమించిన ఏ నాయకుడినైనా నిస్సందేహంగా అంతం చేస్తామన్నారు. సుప్రీం లీడర్‌గా కొత్తగా ఎవరు ఎన్నికైనా, ఎక్కడ దాక్కున్నా వదిలి పెట్టబోమని చెప్పారు. అమెరికా భాగస్వామ్యంతో, ఇరాన్ పాలన సామర్థ్యాలను తుడిచి పెట్టేస్తామని హెచ్చరించారు.