సింధు శుభారంభం
గాయంతో సాత్విక్ జోడీ ఔట్
టోక్యో, జూలై 14: జపాన్ ఓపెన్ సూప ర్ -750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో మలేషియాకు చెందిన వాంగ్ లింగ్‌పై వరుస గేమ్స్‌లో విజయం సాధించి రెండో రౌం డ్‌లో అడుగుపెట్టింది. ప్రపంచ 10వ ర్యాం కర్, మాజీ ప్రపంచ ఛాంపియన్ సింధు.. ప్రపంచ 37వ ర్యాంకర్ వాంగ్‌ను 21--14, 21-11 తేడాతో సునాయాసంగా ఓడించింది.
ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యం చెలాయించిన సింధు ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా కేవలం రెండు గేమ్‌లోనే మ్యాచ్‌ను ముగించింది. మిక్సిడ్ డబుల్స్లో భారత జోడీ ధ్రువ్ కపిలాతనిషా క్రాస్టో కూడా రెండో రౌండ్‌కు చేరింది. స్కాట్లాండ్‌కు చెందిన అలెగ్జాండర్ డన్‌జూలీ జోడీని 21--16, 21--14తో ఓడించింది.
అయితే మరో భారత జోడీ రోహన్ కపూర్-రుత్విక శివానీ గడ్డే మాత్రం ఓటమి పాలైంది. ఇదిలా ఉంటే పురుషుల డబుల్స్‌లో భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ షెట్టి గాయంతో టోర్నీ నుంచి తప్పుకున్నారు. తొలి గేమ్ ముగిసిన తర్వాత భుజం గాయం తిరగబెట్టడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగారు.






