మీసేవ, ఆధార్ సెంటర్ల తనిఖీలు
నిర్ణీత రుసుము కంటే ఎక్కువ వసూలు చేస్తే చర్యలు తప్పవు
ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్
ఏటూరునాగారం, ఫిబ్రవరి27(విజయక్రాంతి): ములుగు జిల్లాలో మంగపేట, ఏటూరునాగారం, తాడ్వాయి మండలాల్లో పలు మీసేవ కేంద్రాలను ఈ -డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్,మీసేవ మేనేజర్లు విజయ్,రాకేష్ లతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రస్తుతం ప్రజలకు మీసేవ ద్వారా రెండు నిమిషాల వ్యవధిలోనే కుల దృవీకరణ పత్రం అందజేయబడుతుంది. అలాగే టీజీపిఎస్సీ పోర్టల్ లో ఓటీఆర్ అప్డేట్ చేసుకొనుటకు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్ నమోదు చేయడంలో ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా నమోదు చేయాలని ఆదేశించారు.
కొత్తగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ సర్వీస్ గురించి మీసేవ నిర్వాహకులకు వివరించారు. ఏ విధమైన టెక్నికల్ సమస్యలు వచ్చిన అతి త్వరగా క్లియర్ చేస్తామని ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ప్రతి అప్లికేషన్ నమోదు చేయాలని తెలిపారు. మీసేవ కేంద్రాలను ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండి ఈఎస్డీ గైడ్లైన్స్ ప్రకారం మీ సేవ కేంద్రాన్ని నడపవలనని సూచించారు. నిర్ణీత రుసుము కంటే ఎక్కువ రుసుము దరఖాస్తుదారుడు నుంచి తీసుకున్నట్లయితే తప్పనిసరిగా అట్టి మీసేవ సెంటర్ పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.




